బాలయ్య సరసన హరిప్రియ

బాలకృష్ణ పక్కన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది హీరోయిన్ హరిప్రియ. తెలుగులో పిల్ల జమీందార్, తకిట తకిట, అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా లాంటి సినిమాల్లో నటించింది ఈ కన్నడ నటి. అంతకు మించి పెద్ద అవకాశాలు ఏవీరాలేదు ఆమెకు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న కేఎస్ రవికుమార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. ఒకపాత్ర నయనతార పోషిస్తోంది. మరొకరు ఎవరు? ఇది పెద్ద సమస్యే.

ఎందుకుంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం అన్నది చాలా సమస్యగా మారింది ఈ మధ్యకాలంలో. అందులో బాలయ్యకు అస్సలు దొరకడంలేదు. ఎవరెవరో నటిస్తున్నారు. ఈసారి ఆ అవకాశం హరిప్రియకు దొరికింది. తెలుగులో పెద్దగా పరిచయం లేని పేరు, ఫేస్ అయినా, ఇప్పుడు బాలయ్య పక్కన చాన్స్ వచ్చింది కాబట్టి, అందరికీ తెలుస్తుంది. ఈ సినిమాకు నిర్మాత సి కళ్యాణ్.