బెంగుళూరుకు పవన్

బెంగుళూరులొని పవన్ అభిమానులు తొందర పడకండి.. ఇప్పుడే,. ఇవ్వాళో రేపో రావడం లేదు పవన్ బెంగుళూరుకు. డిసెంబర్ లాస్ట్ వీక్ లో వచ్చే అవకాశం వుంది. బెంగుళూరు కూడా తెలుగు సినిమాలకు మంచి కమర్షియల్ పాయింట్ గా మారింది.

మన వాళ్లు పెద్ద సంఖ్యలో అక్కడ వుండడమే అందుకు కారణం. దీంతో తెలుగు సినిమాల కర్ణాటక హక్కుల రేట్లు బాగానే పలుకుతున్నాయి. అందువల్ల అంతటి రేట్లకు అమ్మిన తరువాత అక్కడ కూడా సినిమాకు ప్రచారం చేయాల్సిన బాధ్యత హీరోల మీద పడింది.

ఇప్పటికే బన్నీ, ఎన్టీఆర్ తమ సినిమాల విడుదలకు ముందు బెంగుళూరు వెళ్లి ఫ్యాన్స్ మీట్ ల్లో మాట్లాడి వచ్చారు. ఇప్పుడు ఇదే రీతిలో పవన్ కూడా తన అజ్ఞాతవాసి సినిమా కోసం బెంగుళూరు వెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది.

డిసెంబర్ రెండో వారంలో అడియో ఫంక్షన్ అయిన తరువాత అజ్ఞాతవాసి పబ్లిసిటీకి శ్రీకారం చుడతారు. ఇక్కడ ఇంటర్వూలు, అన్నీ ఓ కొలిక్కి వచ్చాక బెంగుళూరు వన్ మార్నింగ్ వెళ్లాలన్నది ఇప్పటికి అనుకుంటున్న ప్లాన్. అన్నీ అనుకున్నట్లు జరిగి, సినిమా మాంచి హిట్ అయితే విశాఖలో ఓ పోస్ట్ మీటింగ్ వుంటుంది.