భాగమతి ఇంకా వెనక్కి?

పాపం, ఎందుకు తలెక్తుకున్నారో తెలియదు భాగమతి సినిమాను యువి జనాలు. అది డబ్బులు లాగేస్తోంది.. టైమూ తినేస్తోంది. పోనీ డైరక్టర్ కు ఏమన్నా క్రేజ్ వుంది. ఎప్పుడు వచ్చినా ఓకె అనుకుంటే, ఎప్పుడో పిల్లజమీందార్ వాసనలు తప్ప, మరోటి లేదు. యువి బ్యానర్, అనుష్క ఈ రెండే ఆధారం. ఈ రెండింటిని బేస్ చేసుకుని, ముఫై కోట్లకు పైగా ఖర్చు చేసేస్తున్నారు. అలా అని సినిమాను మాంచి టైమ్ లో వదులకుంటే అది వేరే సంగతి.

డిసెంబర్ మూడో వారం అని అనుకున్నారు. కానీ నాగ్ నిర్మిస్తున్న అఖిల్-విక్రమ్ కుమార్ హలో సినిమా కోసం వెనక్కు వెళ్తున్నారన్నారు. ఆ తరువాతం సంక్రాంతి బరిలో పక్కా అన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తొంది. మార్చి, ఏప్రియల్ మధ్యలో సరైన డేట్ చూసి భాగమతిని విడుదల చేస్తారని తెలుస్తోంది.

వాస్తవానికి డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాలని సి జి పనులపై దృష్టి పెట్టి చకచకా వర్క్ చేయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ వదిలారు. ఈ సందర్భంగా బోలెడు పబ్లిసిటీకి ఖర్చు చేసారు. మరి ఇంత హడావుడి చేసిన తరువాత మళ్లీ వాయిదా అని ఎందుకు వినిపిస్తున్నట్లో? సిజి వర్క్ అంత టైమ్ తినేస్తోంది అనుకోవాలా? సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వుండడం వల్ల అనుకోవాలా?

ఫిబ్రవరి 9ని డేట్ గా ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.