మన థియేటర్లకు చైనా సిస్టమ్ ?

సగటు సినిమా అభిమానుల మదిలో మెదిలే ప్రశ్న, మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అన్నది. ఏప్రియల్ నెలలో అయితే తెరచుకోవు అన్న అభిప్రాయం ఒకటి నిశ్చయంగా వుంది. మే 1 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం వుందని వినిపిస్తోంది. అయితే అలా తెరుచుకునే థియేటర్లకు చైనాలోప్రస్తుతం అమలు చేస్తున్న పద్దతి అమలు చేస్తారా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఎలా అంటే సీటింగ్ కెపాసిటీని పాతిక శాతానికి తగ్గించడం అన్నమాట. అంటే వెయ్యి మందికి థియేటర్లో సీట్లు వుంటే 250 టికెట్ లు మాత్రమే అమ్మడం. అంటే మనిషికి మనిషికి మధ్య మూడు సీట్లు ఖాళీ వుండేలా చూడడం అన్నమాట. ప్రస్తుతం చైనాలో ఈ విధంగానే నిబంధన పెట్టి, థియేటర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇది కిట్టుబాటు కాదు కాబట్టి, థియేటర్లు తెరచినా కొత్త సినిమాలు విడుదలకు రాకపోవచ్చు.

అయితే మే 1 లోగా కరోనా భయం పూర్తిగా కనుక మాయం అయితే మామూలుగా తెరుచుకుంటాయేమో? అలా కాకుంటే మాత్రం చైనా పద్దతిని అమలు చేస్తారని టాక్. అప్పుడు కేవలం థియేటర్ల ఖర్చులు మాత్రం కిట్టుబాటు అయ్యే అవకాశం వుంది చిన్న సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది.