మహేష్ గురించి వినిపిస్తుందంతా బుస్సే!

మహేష్ సినిమా గురించి మీడియాలో రోజుకో న్యూస్ వినిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఎవరి దగ్గర న్యూస్ లేకపోవడంతో ఎక్కువగా వార్తలు వండి వడ్డించాల్సి వస్తోంది. అలా పుట్టుకొచ్చిందే మహేష్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ తాలూకు న్యూస్. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ చేసే చిత్రంలో హీరోయిన్ గా హిందీ తారలని కన్సిడర్ చేస్తున్నారని, కియారా అద్వానీ లేదా సారా అలీ ఖాన్ ఇందులో నటిస్తుందని చాలా మంది అప్డేట్ ఇచ్చారు.

అయితే నిజానికి ఈ చిత్రానికి ఇంతవరకు హీరోయిన్ ఎవరనే డిస్కషన్ కూడా జరగలేదు. ఇంకా నిర్మాతల మధ్య పితలాటకం ఒక కొలిక్కి రాలేదు కనుక అటు మహేష్ కానీ ఇటు పరశురామ్ కానీ హీరోయిన్ గురించి ఆలోచించడం లేదు.

ఎవరి వాటా ఎంత, అధికారికంగా ప్రకటించేది ఎపుడు వంటివి తేల్చుకున్నాకే హీరోయిన్ గురించి డిసైడ్ అవుతారట. అంతవరకూ ఎన్ని వార్తలొచ్చిన బుస్సే అని ఫిక్స్ అయిపోండి.