ముమైత్ ఖాన్ చెల్లెలు కీర్తిసురేష్

పాపం కీర్తిసురేష్.. ఈ హీరోయిన్ ఎప్పుడూ ఆడియన్స్ కు టార్గెట్ కాలేదు. ఈసారి మాత్రం నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. సోషల్ మీడియాలో కీర్తిసురేష్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు జనాలు. దీనికి కారణం అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్.

ఈ ఫంక్షన్ కు ఓ డిఫరెంట్ గెటప్ లో వచ్చింది కీర్తిసురేష్. వేసుకున్న డ్రెస్, పూసుకున్న మేకప్ నుంచి హెయిర్ స్టయిల్ వరకు అంతా వెరైటీ. కొత్తగా ఉందని చెప్పుకునే కంటే బాగా లేదని ఒప్పుకోవడం బెటర్. మరీ ముఖ్యంగా ధగధగ మెరిసిపోతున్న అను ఎమ్మాన్యుయేల్ పక్కన జిడ్డు మొహం పెట్టుకొని కీర్తిసురేష్ నిల్చుంటే అస్సలు ఎవరికీ నచ్చలేదు.

గతంలో పలు ఫంక్షన్లు, రిబ్బన్ కటింగ్స్ కు గెస్ట్ గా వచ్చిన ముమైత్ ఖాన్ లా కీర్తిసురేష్ ఉందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రాలింగ్ మొదలైంది. ఆ విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తూ కీర్తిసురేష్, ముమైత్ ఖాన్ ఫొటోలతో ఫేస్ బుక్ లో తెగ పోస్టులు పడుతున్నాయి.

నిజానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ బబ్లీగా ఉంటుంది. ఆఫ్-స్క్రీన్ లో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఇలాంటి హీరోయిన్ సడెన్ గా ఇలా అదో రకంగా తయారై ఫంక్షన్ కు వచ్చేసరికి జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఫ్యాషన్ డిజైనర్లు దీన్ని ‘వింటర్ ట్రెండ్’ అని పిలుచుకోవచ్చు గాక, ఆడియన్స్ కు మాత్రం ఆ గెటప్ నచ్చలేదు. అందుకే ముమైత్ చెల్లెలు కీర్తిసురేష్ అంటూ ట్రాలింగ్ మొదలుపెట్టారు.