మోడీ ఘనత: సెంచరీ కొట్టేశాం

నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం వెలిగిపోతోంది. ‘ఆకలి’ లెక్కల్లో భారతదేశం ఈసారి సెంచరీ కొట్టేసింది. గత ఏడాది అంటే 2016లో 97వ స్థానంలో నిలిచిన భారతదేశం, ఈసారి మూడు స్థానాలు దిగజారి 100వ స్థానంలో నిలిచింది. ‘గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌’ గణాంకాలివి. బంగ్లాదేశ్‌ కంటే కూడా మన పరిస్థితి దారుణంగా వుండడం గమనార్హం. ఆప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ మాత్రమే మనకంటే కాస్త వెనక వుండడం కొంత ఊరట అనుకోవాలేమో.!

మీకు తెలుసా.? నరేంద్రమోడీ పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. మరి, పేదలెందుకు ఆకలితో ఇంతలా అలమటిస్తున్నట్లు.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. బహుశా, గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ని ప్రభావితం చేసే స్థాయిలో మోడీ ఇమేజ్‌ పెరిగి వుండదు. లేకపోతే, ఇందులోనూ భారతదేశానికి టాప్‌ పొజిషన్‌ వచ్చి వుండేది.

భారతదేశం వెలిగిపోవడం కాదు, నరేంద్రమోడీ హయాంలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. పెద్ద పాత నోట్ల రద్దు, జీఎస్‌టీ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత పతనావస్థకు చేరుకుందని ఆర్థిక రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తోంటే, నిరాశావాదులే అలా మాట్లాడతారని నరేంద్రమోడీ కథలు చెప్పారు. మరి, ఈ ‘ఆకలి కేకల’ మాటేమిటి.?

ఏమో, 2017లో ఇప్పుడున్న 100వ స్థానం కాస్తా, 119వ స్థానానికి పడిపోతుందేమో.! ఎందుకంటే, సంస్కరణలు ఇంకా చాలా వున్నాయంటున్నారు నరేంద్రమోడీ. మేకిన్‌ ఇండియా సంగతి దేవుడెరుగు.. పేదలకి డుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వం వుంటే ఎంత.? ఊడితే ఎంత.?