రంగులరాట్నం కాస్త ఖరీదే

ఎప్పుడో ఉయ్యాల జంపాల తరువాత మరో అడ్వాన్స్ అందింది అన్నపూర్ణ నుంచి హీరో రాజ్ తరుణ్ కు. ఇన్నాళ్లకు ఆ సినిమా పూర్తయింది. కొత్త దర్శకురాలు, కొత్త హీరోయిన్. పక్కా ఫ్యామిలీ స్టోరీ. అందువల్ల నిర్మాత నాగార్జున మళ్లీ తక్కువ బడ్జెట్ లో ఓ సినిమా లాగించేసాడు అనుకున్నారంతా. పైగా రాజ్ తరుణ్ కు కూడా పాతకాలం నాటి రేటు కాబట్టి. కానీ విషయం వేరంట.

ఈ సినిమాకు ఫస్ట్ కాపీకే నాలుగుకోట్ల దగ్గరగా అయిందని వినికిడి. దీనికి కారణం ఏమిటంటే, సినిమాలో కాస్త గ్రాండీ లుక్ వుండడమేనట. పైగా సినిమాలో మూడు నాలుగు మ్యారేజ్ ఎపిసోడ్ లు వున్నాయట. దాంతో కలర్ ఫుల్ లుక్ కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేసారట.

సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో ఆ కలర్ ఫుల్ లుక్ వుంటే ఎలా వుంటుందో చూసిన నాగార్జున, ఈ సినిమా కూడా కాస్త బాగా వుండేలా చూడమని ముందే చెప్పేసాడట.

ఒక్క చిన్న సాంగ్ మినహా మిగిలిన వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి టార్గెట్ గా రెడీ అవుతోంది. గత రెండు సంక్రాంతులకు యూవీ నుంచి ఓ చిన్న సినిమా వచ్చి పెద్ద సినిమాలతో పాటు పోటీలో నిలిచింది. ఈసారి అన్నపూర్ణ నుంచి వస్తోంది అన్నమాట.