రష్యాలో ‘పుష్ప’ అల్లాటప్పా రిలీజ్ కాదు.. ఇదే సాక్ష్యం

అల్లు అర్జున్ పుష్ప సినిమాను రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. రష్యన్ భాష లో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. డిసెంబర్ 8న రష్యాలో భారీ ఎత్తున పుష్ప సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. విదేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి కానీ ఎంత వరకు అక్కడ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది అనేది అనుమానమే.

పుష్ప విషయంలో కూడా అదే అనుకున్నారు. ఇక్కడ హడావుడినేనా అక్కడ కూడా హడావుడి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులు జపాన్ ఎలా అయితే వెళ్లారో అలాగే అల్లు అర్జున్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు రష్యా ప్రయాణం అయ్యారు.

ఇప్పటికే అల్లు అర్జున్ రష్యా ఫ్లైట్ ఎక్కేశాడు.. చిత్ర యూనిట్ సభ్యులు కూడా కాస్త అటు ఇటుగా రష్యాలో ల్యాండ్ అవ్వబోతున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు రష్యా వెళ్లారు.. వెళ్లబోతున్నారు కనుక అక్కడ రిలీజ్ అల్లాటప్పాగా ఉండబోదు అని.. కచ్చితంగా కాస్త హై లెవల్ లోనే రిలీజ్ ఉంటుందనే నమ్మకంను అందరు వ్యక్తం చేస్తున్నారు.

ఏకంగా అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కోసం రష్యా వెళ్లాడు కనుక భారీ ఎత్తున అక్కడ ఓపెనింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బన్నీ పలు ప్రీమియర్ షో లకు హాజరు అయ్యి స్థానిక మీడియా లో వార్త కథనాలు వచ్చేలా చేస్తాడు. సినిమా గురించి కాస్త ఎక్కువగానే ప్రచారం చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇటీవలే పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. మారేడు మిల్లీ ప్రాంతంలో పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుందనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పుష్ప యొక్క ప్రమోషన్ కోసం రష్యా కు వెళ్లడం చూస్తూ ఉంటే అక్కడ రిలీజ్ విషయంలో ఎంత సీరియస్ గా బన్నీ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. బన్నీ కి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సమంత ఐటం సాంగ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఏ స్థాయిలో కుమ్మేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో ఎలా అయితే భారీగా విజయాన్ని సొంతం చేసుకుందో రష్యా లో కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి అంటే మరో వారం ఆగాల్సిందే.