రాజుగారి గది-2లో అఖిల్

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది-2 సినిమా నాగార్జున, సమంత చుట్టూనే తిరుగుతుంది. మరీముఖ్యంగా ఈ సినిమాలో కీలకమైన క్లైమాక్స్ ఘట్టానికి సమంత మార్పుచేర్పులు చెప్పిందని స్వయంగా నాగార్జున ప్రకటించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనికితోడు ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటపెట్టాడు నాగ్.

రాజుగారి గది-2 సినిమాకు అఖిల్ కూడా సహకారం అందించాడట. ఈ సినిమాలో కొన్ని చోట్ల నాగార్జున ఓ పొడుగాటి కోట్ తో కనిపించాడు. నాగార్జునపై తీసిన సాంగ్ తో పాటు.. ఓ కేసును ఛేదించే సన్నివేశాల్లో ఈ కోట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కోట్ ను నాగార్జున కోసం కొరియా నుంచి ప్రత్యేకంగా తెప్పించాడట అఖిల్.

కోట్ మాత్రమే కాకుండా సినిమాలో నాగార్జున వాడిన బూట్లను కూడా అఖిల్ ప్రత్యేకంగా తెప్పించాడట. ఇవన్నీ తన పుట్టిన రోజుకు అఖిల్ గిఫ్ట్ గా ఇచ్చాడని తెలిపాడు నాగ్. వీటితో పాటు 55ఏళ్ల వయసున్న ఓ చెట్టును కూడా తన పుట్టినరోజు కానుకగా అందించాడని, రాత్రికి రాత్రి ఆ చెట్టును తన ఇంట్లో నాటించాడని చెప్పుకొచ్చాడు.