లాక్ డౌన్ ఉన్నా జగన్ ఆ పని చేస్తాడట.!

ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వణికిస్తోంది. రోజు రోజుకు దేశంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో మార్చి 31 వరకు ఇదే విధమైన కర్ఫ్యూ విధించాలని కేంద్రం ఆదేశించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని నిన్నటి రోజున కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే, దేశంలోని చాలా రాష్ట్రాలు ఓ అడుగు ముందుకు వేసి లాక్ డౌన్ ను ప్రకటించాయి.
తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ చేశాయి. తెలంగాణలో అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిని క్లోజ్ చేయగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాక్షికంగా లాక్ డౌన్ చేసింది. ఇంటర్, పదోతరగతి పరీక్షలు యధావిధిగా నడుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈనెల 27 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉందని, బడ్జెట్ ప్రవేశపెట్టకుంటే అత్యవసర సర్వీసులకు డబ్బులు ఖర్చు చేయడం ఇబ్బంది అవుతుందని, అందుకే ఈనెల 27 వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.
రోజు రోజుకు కరోనా ప్రభావం పెరిగిపోతున్నది. మార్చి 27 అంటే ఇంకా నాలుగు రోజులు ఉన్నది. ఈలోగా ఈ సమస్య మరింతగా పెరిగిపోతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉన్నది. ఏది ఏమైనా ఈనెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీరుతామని వైకాపా ప్రభుత్వం చెప్తున్నది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి చూద్దాం ఏమౌతుందో.