లాక్ డౌన్ లో ఆ సినిమాలదే రాజ్యం!

చిన్న సినిమాలను థియేటర్లలోనే కాదు స్ట్రీమింగ్ లో పెట్టినా చిన్న చూపు చూస్తుంటారు. ఫ్రీగా చూడ్డానికి కూడా కొన్ని సినిమాల విషయంలో జనం చాలా లెక్కలు వేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇంట్లోనే బంధించి పెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కంటెంట్ దొరికినా చూసేస్తున్నారు.

ఈ టైములో వచ్చిన ఓ పిట్ట కథ, రాజావారు రాణిగారు చిత్రాలను ఎక్కువమంది చూస్తున్నారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి సినిమా కూడా అందుబాటులో ఉన్నా కానీ అడల్ట్ కంటెంట్ కావడం వల్ల ఈ చిన్న సినిమాలకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నాని నిర్మించిన హిట్ నెట్ లో పెట్టడంతో దానిని ఎగబడి చూస్తున్నారు.

ఈ టైం లో పెద్ద సినిమాలేవీ లేకపోవడం, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాక్ డౌన్ కి ముందే రావడంతో చిన్న సినిమాలు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నాయి. ఈ సినిమాలకి దక్కుతున్న ఆదరణ చూసి కొన్ని చిన్న సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్ లో పెట్టేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పలువురు నిర్మాతలున్నారు.