లావణ్య త్రిపాఠి ఫస్ట్ లిప్ కిస్

హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన మొట్టమొదటి లిప్ కిస్ ఎవరికిచ్చిందో తెలుసా. హీరో నానికి ఇచ్చింది. అవును.. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టింది. ఓ టీవీ షోలో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో ఇప్పటివరకు ఎవర్నీ పెదవిపై ముద్దాడలేదని, నానికి మాత్రం ఆ అదృష్టం దక్కిందని అంటోంది.

భలే భలే మగాడివోయ్ సినిమాలో నానిని ముద్దాడే సీన్ ఒకటుంది. నిజానికి అది బుగ్గపై పెట్టే ముద్దు మాత్రమే. కానీ రిహార్సల్స్ సందర్భంగా అనుకోకుండా నాని పెదాలపై ముద్దుపెట్టేసిందట లావణ్య త్రిపాఠి. సినిమాలో ఆ సీన్ లేకపోయినా.. రియల్ గా మాత్రం ఆ ముద్దు అలా వర్కవుట్ అయిపోయింది.. తన జీవితంలో అదే మొదటి లిప్ కిస్ అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

తను కావాలని ఇప్పటివరకు ఎవర్నీ లిప్ కిస్ పెట్టలేదంటోంది ఈ బ్యూటీ. కెమెరా ముందు పెదాలపై ముద్దుపెట్టడం అంటే చాలా కష్టమని, అలాంటి సన్నివేశాల్లో ఇప్పటివరకు నటించలేదని, భవిష్యత్తులో కూడా నటించకూడదని అనుకుంటున్నానని చెప్పింది లావణ్య. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన ఓ మూవీ చేస్తోంది.