విశాల్ హీరో నే

Tamil Actor Vishal New Photos

తమిళనాడు లోని ఆర్ కె నగర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నా అని ప్రకటించేశారు హీరో విశాల్. విశాల్ ఎప్పుడూ సంచలనమే. తెలుగు వాడై వుండి.. తన లక్ ఇక్కడ ట్రయ్ చేయకుండా తమిళనాడులో కెరీర్ స్టార్ట్ చేసాడు. నిజానికి ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటే ఎప్పుడో పక్కకు వెళ్ళేవాడు. పందెం కోడితో బోలెడు పేరు వచ్చాక కూడా ఇక్కడ కు వచ్చేయకుండా అక్కడే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

శరత్ కుమార్ లాంటి వాడిని ఢీకొని నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురు ఈదుతూనే ఉన్నాడు. మెర్సల్ విషయంలో సపోర్ట్ చేస్తే ఐటీ దాడులు తప్పలేదు. అయినా జంకలేదు. విశాల్ ఎన్నికల్లోకి.. రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పటినుంచో వినిపిస్తోంది. కానీ విశాల్ మిగిలిన తమిళ హీరోల్లా అక్కర్లేని ప్రకటనలు చేస్తూరాలేదు. మీన మేషాలు లెక్కపెట్టలేదు. టక్కున వచ్చేసాదంతే.

ఆర్కే నగర్ బరిలోకి ఇండిపెండెంట్ గా దిగడం వెనుక విశాల్ స్ట్రాటజీ ఏదో ఉండే ఉంటుంది. బహుశా దీన్ని ఓ ప్రయోగంగా చేస్తున్నాడేమో. ఏమైనా వస్తాను.. రాను.. వస్తాను అనే రజనీకాంత్ కన్నా విశాల్ బెటర్. ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది పక్కన పెడితే ఓ ధైర్యం చేస్తున్నాడు. అది గొప్ప విషయం.

ఇన్నాళ్లు అతగాడు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆ దన్ను ఇచ్చి ఉండాలి అయితే గెలుపు అంత సులువు కాదు.. తమిళ పార్టీలు, జాతీయ పార్టీలు ఉండగా కష్టమే. కానీ విశాల్ అడిగితే ఎదో ఓ పార్టీ టిక్కెట్ ఇస్తుంది. ఆయనా అది వదులుకుని ఇలా బరిలోకి దిగడం అంటే గొప్ప విషయమే.