వెంకీ సరసన లక్కీ

తేజ దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ దాదాపు ఫిక్స్ అయింది. రాజా ది గ్రేట్ సినిమాలో లక్కీ పాత్రలో కనిపించిన మెహ్రీన్ ను వెంకీ సరసన హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

బాగా సీనియర్లు అయిపోయిన బాలయ్య, వెంకీ, చిరంజీవి లాంటి నటులకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. నయనతారను మళ్లీ రిపీట్ చేసే పొజిషన్ లో వెంకీ లేడు. మరీ ముఖ్యంగా ‘బాబు బంగారం’ నాటి చేదు అనుభవాలు వెంకీకి ఇంకా గుర్తే. మరోవైపు కాజల్ చేయనని చెప్పేయడంతో మెహ్రీన్ వైపు చూస్తున్నారు.

బొద్దుగా కనిపించే మెహ్రీన్, వెంకీ లాంటి సీనియర్ సరసన సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనీల్ సుంకర, సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నవంబర్ రెండో వారంలో మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడు వెంకటేష్.