సప్తగిరి సినిమాలో రెండే డ్యూయట్లంట

సప్తగిరి హీరోగా చేస్తున్న రెండో సినిమా సప్తగిరి ఎల్‌ఎల్‌బి. ట్రయిలర్ చూడగానే చాలా మంది కమెడియన్ల మాదిరిగానే హీరో కాగానే పాటల మీద మోజు పెరిగినట్లుంది అనిపిస్తుంది. మొదటి సినిమాలో డ్యాన్స్ లు, పాటలు చేసేసాడు సప్తగిరి. అందువల్ల ఈ రెండో సినిమాలో కూడా అలాగే పాటలు కుమ్మేసి వుంటాడు అన్న అభిప్రాయాలు వినిపించాయి. ట్రయిలర్ కూడా అలాగే వుంది.

కానీ సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమా మొత్తం మీద జస్ట్ మూడే పాటలంట. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్. తొలిసగంలో ఒక మాంటేజ్ సాంగ్, ఓ డ్యూయట్ వుంటే, మలి సగంలో ఒక్క డ్యూయట్ మాత్రమే వుంటుందట.

జాలీ ఎల్‌ఎల్‌బి సినిమా ఆధారంగా తీస్తున్నారు కాబట్టి కథ కాస్త ఎక్కువే వుంటుంది. అందువల్ల ఆ కథను అలా తీసుకుంటూనే, అక్కడ పాటలకు ఏ ప్లేస్ మెంట్ అయితే సెట్ చేసారో, ఇక్కడ అదే ప్లేస్ మెంట్ లో ఇలా సెట్ చేసారట. సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయికుమార్ కు మాంచి పేరు తెస్తుందని అంటున్నారు. చూడాలి మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోందిగా.