సహజత్వం కోసమే లిప్ కిస్

“సినిమాలో సీన్ అత్యంత సహజంగా రావాలంటే ఏం కావాలంటే అది చేయాలి. ఒక సన్నివేశంలో నేచురాలిటీ కోసం ముద్దు సీన్ పెట్టాం. దాన్ని ఇంకాస్త డెవలప్ చేసి లిప్ కిస్ గా మార్చేశాం. ప్రతి ఇంట్లో జరిగేదే చూపించాం. ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామన్ కదా.” తన లిప్ కిస్సులపై హీరోయిన్ ఆండ్రియా వివరణ ఇది.

గృహం సినిమాలో సిద్దార్థ్ తో కలిసి నటించింది ఆండ్రియా. కంప్లీట్ హారర్ సినిమా అది. అలాంటి సినిమాలో హాట్ హాట్ ముద్దులతో పనేంటని అడిగిన ప్రశ్నకు ఆండ్రియా పై విధంగా రెస్పాండ్ అయింది. సన్నివేశాలు సహజంగా రావాలంటే ముద్దులు పెట్టాల్సిందే అంటోంది.

అయితే ఇంట్లో నాలుగు గోడల మధ్య ముద్దులు పెట్టుకోవడానికి, వెండితెరపై ఓపెన్ గా ముద్దాడ్డానికి తేడా లేదా అనే ప్రశ్నను మాత్రం ఆమె దాటేసింది. తాము కేవలం నటిస్తామని, సన్నివేశాన్ని పండించడానికి అప్పుడప్పుడు ఇలా లిప్ కిస్ లు పెట్టాల్సి వస్తుందని అంటోంది ఆండ్రియా. ట్రయిలర్ లో చూపించిన ముద్దు కాకుండా సినిమాలో మరో 3సీన్లు ఉన్నాయంటోంది.

మొత్తమ్మీద సిద్దార్థ్-ఆండ్రియా లిప్ కిస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గృహం సినిమా భయపెట్టడంతో పాటు కూసింత ఈ వినోదాన్ని కూడా అందించేలా ఉంది. ఈ వీకెండ్ (నవంబర్ 3) విడుదలకు సిద్ధమైంది గృహం