సినీ ఇండస్ట్రీ నాశనం… ‘2018’ ప్రత్యక్ష సాక్ష్యం

కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ కుదేలయింది. సౌత్ లో కొన్ని భాషల సినిమాలు వసూళ్లు రాబట్టగలుగుతున్నాయి కానీ ఉత్తరాదిన సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలం లో ఒకటి రెండు సినిమాలు మినహా హిందీ లో సక్సెస్ అయ్యి.. థియేటర్ల ద్వారా భారీ వసూళ్లు సాధించిన సినిమాలే కరువయ్యాయి.

ఇలాంటి సమయం లో మలయాళం లో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2018 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నెల రోజుల్లో దాదాపుగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. మరో నెల రోజుల పాటు ‘2018’ సినిమా సాలిడ్ వసూళ్లను సాధించగల సత్తా ఉంది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ వల్ల వసూళ్లు డ్రాప్ అయ్యాయి.

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న 2018 సినిమా ను ఈనెల 7వ తారీ కు నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా కలెక్షన్స్ ఒక్క సారిగా డ్రాప్ అయ్యాయి. కచ్చితంగా రూ.200 కోట్ల క్లబ్ లో ఈ సినిమా పడుతుందని అంతా భావించినా కూడా కేవలం ఓటీటీ వల్లే సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ఇక తెలుగు లో కూడా ‘2018’ సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి వారం రోజుల్లో దాదాపు పది కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయ్యాయి. మరో పది రోజుల పాటు ఈ సినిమా థియేటర్ల ద్వారా సందడి చేసే వీలు ఉండేది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ ప్రకటన రావడంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీ ఓటీటీ లో వెంటనే స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా నాశనం అవుతుందని కొందరు సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ ఓటీటీ లో రెండు మూడు వారాల్లోనే వస్తుంది కనుక థియేటర్ కు వెళ్లి చూడాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు భావిస్తున్నారు. అందుకే థియేటర్ ల పరిస్థితి దారుణంగా పరిస్థితి ఉంది.

ఈ పరిస్థితి కి 2018 సినిమా ప్రత్యక్ష సాక్ష్యం కాగా… ఇలా ఎన్నో సినిమాలు నష్టపోతున్నాయి. కనుక సినిమాలు థియేటర్ లో విడుదల అయిన తర్వాత కచ్చితంగా 50 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాల ని కఠిన నిబంధన అమలు అవ్వాల ని సినీ ప్రేమికులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రూల్ ను పెద్ద నిర్మాతలు అమలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అలా చేస్తే ఓటీటీ ద్వారా వచ్చే లాభం ను మిస్ అవ్వాల్సి ఉంటుందని వారి ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఈ పరిస్థితికి పరిష్కారం ఎలా దక్కుతుందో కాలమే నిర్ణయించాలి.