సురేష్ కాంపౌండ్ నుంచి గీతా క్యాంప్ కు

టాలీవుడ్ లోని బలమైన సంస్థల్లో గీతా, సురేష్ కచ్చితంగా వుంటాయి. నిర్మాత కమ్ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి ఇప్పటి దాకా సురేష్ కాంపౌండ్ కు దగ్గరగా వున్నారు. పెళ్లిచూపులు సినిమా దగ్గర నుంచి ఆయన సురేష్ కాంపౌండ్ లో వుంటూ వస్తున్నారు.

పెళ్లి చూపులు తరువాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ (రానా తమ్ముడు)ను హీరోగా పరిచయం చేయాలని మధుర శ్రీధర్ ప్రయత్నించారు. కానీ సురేష్ బాబు అంతగా సుముఖత చూపలేదని బోగట్టా. ఆ తరువాత ఏమయిందో తెలియదు.

గీతా అరవింద్ చిన్న కొడుకు శిరీష్ తో సినిమా చేయబోతున్నారు మధుర శ్రీధర్ అని ముందే వెల్లడించాం. ఇప్పుడు అదే నిజమైంది. శిరీష్ హీరోగా ఎబిసిడి (అమెరికా బార్న్డ్, కన్ఫ్యూజ్ దేశీ) అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నారు మధుర శ్రీధర్. వాస్తవానికి ఈ సినిమా మళయాల రీమేక్. అక్కడ దుల్కర్ సల్మాన్ నటించిన ఎబిసిడి (అమెరికా బార్న్డ్, కన్ఫ్యూజ్ దేశీ) సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారు.

అయితే ఇది ఒక విధంగా సోలో హీరో సినిమా కాదు. మరో రెండు యంగ్ పాత్రలు వుంటాయి. మరి వాటికి ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ఎవర్ని తీసుకున్నా శిరీష్ ను డామినేట్ చేయకుండా వుండేవారినే తీసుకోవాల్సి వుంటుంది.