సెట్స్ పైకి రాని కొత్త పెళ్లికొడుకు

ఈనెల 6న సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు సమంత-నాగచైతన్య. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇవ్వనని ప్రకటించినట్టుగానే సమంత ఆల్రెడీ సినీకార్యకలాపాలు ప్రారంభించింది. రాజుగారి గది-2 ప్రమోషన్ లో పాల్గొంది. మహానటి మూవీ సెట్స్ పైకి వచ్చింది. త్వరలోనే రంగస్థలం షెడ్యూల్ కూడా షురూ చేయబోతోంది. కానీ నాగచైతన్య మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు.

పెళ్లయిన వెంటనే 15వ తేదీ నుంచి సవ్యసాచి సినిమా స్టార్ట్ చేస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అలాంటి హంగామా ఏదీ కనిపించలేదు. సవ్యసాచి కాకుండా మారుతి దర్శకత్వంలో మరో సినిమా లాంఛనంగా ప్రారంభమౌతుందని అనుకున్నారు. అది కూడా జరగలేదు.

ప్రస్తుతానికి నాగచైతన్య సెట్స్ కు దూరంగా గడుపుతున్నాడు. ఓ వైపు సమంతతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సవ్యసాచి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు