హలో చిరంజీవి.. ఏంటిది?

అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి యూనిట్ వాళ్లు ఇలా చెప్పుకుంటే ఫర్వాలేదు. ప్రమోషన్ లో భాగంగా ఎన్నయినా చెప్పొచ్చు. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి హలో గురించి చెప్పిన మాటలివి. ఈ ప్రాజెక్టుతో చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా మాత్రమే వచ్చారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబితే సరిపోతుంది. కానీ అంతకుమించి మాట్లాడారు చిరు.

ఈమధ్య కాలంలో ఇతర సినిమాల గురించి చిరంజీవి ఇంతలా మాట్లాడింది లేదు. హలోకు మాత్రం చాలా హైప్ ఇచ్చారు. పొద్దున్న సినిమా చూసి సాయంత్రం ఈవెంట్ కు రావడంతో హలో ఎఫెక్ట్ చిరంజీవిపై గట్టిగా పడిందనుకోవాలా… లేక నిజంగానే హలో సినిమా బాగుందనుకోవాలా..? ఏ విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

ప్రస్తుతానికి ఆడియన్స్ దృష్టి హలో సినిమాతో పాటు చిరంజీవిపై కూడా పడింది. రేపు రిలీజ్ కానున్న హలో సినిమా చిరు చెప్పిన రేంజ్ లో లేకపోతే ఆడియన్స్ కు చిరంజీవి కచ్చితంగా టార్గెట్ అవుతారు. మెగాస్టార్ పై కామెంట్స్ తప్పవు.

గతంలో కృష్ణ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆగడు సినిమాను వందకోట్ల సినిమాగా చెప్పుకొచ్చారు కృష్ణ. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆగడు అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పట్లో అంతా కృష్ణ జడ్జిమెంట్ పై విమర్శలు చేశారు. కాకపోతే కొడుకు సినిమాపై కృష్ణకు ఆమాత్రం ప్రేమ ఉంటుందని అంతా సర్దిచెప్పుకున్నారు.

కానీ చిరంజీవి విషయానికొస్తే, ఇది అతడి కొడుకు చిత్రం కాదు. కనీసం మెగా కాంపౌండ్ మూవీ కూడా కాదు. అలాంటి సినిమాను రిలీజ్ కు ముందే ఆకాశానికెత్తేశారు చిరు. ఇప్పుడా మూవీ రిజల్ట్ కోసం అక్కినేని ఫ్యామిలీతో పాటు చిరంజీవి కూడా ఆత్రంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.