హీరోయిన్లు కొంపలు కూల్చేస్తారా?

ఒక్క సినిమా చాన్స్ లు ఇస్తామని చెప్పి, ఆశపెట్టి, హీరోయిన్లు కావాలనుకున్నవారి, హీరోయిన్లు అయిన వారిని అన్ని విధాలా వాడేస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు తెగ వినిపిస్తున్నాయి.టీవీల్లో ఇవే చర్చలు, యూట్యూబ్ లో ఇవే వీడియోలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. చిత్రంగా దీనికి రివర్స్ గా కొత్త పాయింట్ బయటకువచ్చింది. హీరోయిన్లు నిర్మాతలు, ఇతరత్రా జనాల కొంపల్లో చిచ్చుపెడతారట. అన్నది కూడా సాదా సీదా పర్సన్ కాదు.

తమిళనాట కాస్త పేరుండి, తెలుగుజనాలకు కూడా పరిచతమైన నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా భార్య నేహా ఈ ఆరోపణలు, విమర్శలు చేయడం విశేషం. అయితే ఈ విమర్శలు, ఆరోపణలు జస్ట్ జనాంతికం అంట. ఆమె వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం సంబంధం లేదట.ఎందుకంటే నేహా ఈ విధంగా సోషల్ నెట్ వర్క్ లో కామెంట్లు పెడితే, అందరూ, జ్ఞాన్ వేల్ రాజా ఏ హీరోయిన్ వలలో పడ్డాడో? వాళ్ల కాపురంలో ఏమయ్యిందో అనుకున్నారు. కానీ అదేం కాదని, ఇన్ జనరల్ గా జరుగుతున్న విషయం చెబుతున్నానని నేహా క్లారిటీ ఇచ్చింది. తన కాపురం బాగానే వుందని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంది.

తన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూసి చెబుతున్నానని, చాలా మంది హీరోయిన్లు పెళ్లయిన వాళ్లకు వలేయడం చూసి అంటున్నానని నేహా పేర్కొంది. ఆడవాళ్లకు ఆడవాళ్లే శతృవులుగా మారుతున్నారని వాపోయింది.