మన ఎంపీలు ఎంత పేదోళ్లంటే.

రెండున్నర లక్షల ఆదాయం దాటితే ఇన్ కం ట్యాక్స్ కట్టాల్సిందే.  నెల జీతం తీసుకునే ఉద్యోగులంతా తమ ఆదాయాన్ని దాచిచూపించలేక పక్కా లెక్కలతో ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన పరిస్థితి. పన్ను కట్టకుండా తప్పించుకోవాలంటే పొదుపు చేయాలి. కానీ.. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు.. కోట్లకు కోట్లు అక్రమంగా కూడబెడుతున్న ప్రజాప్రతినిధుల్లో మాత్రం చాలామంది ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారు. మన దేశంలో 59తం ఎంపీలు, ఎమ్మెల్యేలు పన్ను చెల్లించడం లేదట.

2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం 72 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఆదాయాన్ని రూ.10 లక్షల కంటే చూపించారట.  35 శాతం మంది అయితే ఏకంగా పన్ను చెల్లించనవసరం లేనంతగా రూ.2.5 లక్షల కంటే తక్కువ చూపించారు. అంటే వారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదన్నమాట. 40 శాతం మంది 25. నుంచి 10 లక్షల మధ్య ఆదాయాన్ని చూపించారు.

ఇక 24 శాతం మంది తమకు ఎలాంటి ఆదాయం లేదని ఇన్ కం ట్యాక్సు రిటర్నుల్లో చూపించుకున్నారు. ఈ లెక్కన 2.5 లక్షల పన్ను మినహాయింపు పరిధిలోని 35 శాత మంది.. ఈ 24 శాతం మంది కలిపితే 59 శాతం మంది అసలు పన్ను చెల్లించలేదన్నమాట. కేవలం 25 శాతం మంది మాత్రమే తమ ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉందని చూపించారు.

ఇక పార్టీల లెక్కల్లోకి వస్తే 83 శాతం మంది సమాజ్ వాది పార్టీ ఎంపీలు, 78 శాతం మంది అన్నా డీఎంకే ఎంపీలు, 68 శాత టీడీపీ ఎంపీలు, 80 శాతం బీజేడీ ఎంపీలు తమ ఆదాయాన్ని 10 లక్షల కంటే చూపించారు.