బాలయ్య ఫ్యాన్స్ పట్టుదల.. ఆ రీ రిలీజ్ రికార్డులు బ్రేక్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి అవ్వబోతుంది. ఈ సందర్భంగా బాలయ్య అభిమానుల కోసం ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ ను నిర్మాత బెల్లంకొండ సురేష్ అధికారికంగా ప్రకటించాడు.

ఈనెల 24వ తారీకు భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే మొదలు అయ్యింది. అమెరికాలో ఈ సినిమా దాదాపుగా మూడు లక్షల డాలర్ల ను వసూళ్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేశాయి. ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్ అయ్యాయి.

బాలయ్య కి సీడెడ్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఈ సినిమా రెగ్యులర్ సినిమా మాదిరిగా భారీగా వసూళ్లు చేసే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది.

ఈ సినిమా వసూళ్లలో 75 శాతం ను బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాను ప్రదర్శించేందుకు గాను 300 థియేటర్లకు పైగా ఎంపిక చేయడం జరిగింది. అందులో అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యాయి. ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెన్నకేశవరెడ్డి సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.

బాలయ్య ను ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ లో అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకున్నారో అలా చూపించి సక్సెస్ దక్కించుకున్నాడు. బాలయ్య డబుల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా లో టబు మరియు శ్రియ శరన్ లు హీరోయిన్స్ గా నటించిన విషయం తెల్సిందే.