బాలీవుడ్ లో ఈ పరిస్థితికి కారణం అదేనంటున్న రణ్ బీర్

బాలీవుడ్ లో గత దశాబ్ద కాలంగా సక్సెస్ రేటు పడిపోయింది. ముఖ్యంగా కరోనా తర్వాత సక్సెస్ రేటు దారుణంగా పడిపోవడంతో మేకర్స్ సినిమాలను చేయడమే మానేశారు అనే విషయం తెల్సిందే. గతంతో పోల్చితే హిందీలో సినిమాలు చాలా తక్కువగా రూపొందుతున్నాయి. ఒక వేళ రూపొందినా కూడా చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా వచ్చే విధంగా ఉంటున్నాయి.

భారీ సినిమాలు.. మీడియం బడ్జెట్ సినిమాలు గతంతో పోల్చితే కనీసం 30 శాతం తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఈ పరిస్థితిపై షాకింగ్ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

గత కొంత కాలంగా బాలీవుడ్ లో కొత్త వారికి అవకాశాలు దక్కడం లేదు. కొత్తవారికి అవకాశం ఇస్తే తప్పకుండా ఇండస్ట్రీ లో మంచి సినిమాలు వస్తాయి. కనుక కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని రణ్బీర్ పేర్కొన్నాడు. ప్రయోగాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు కొత్తగా ఆలోచించాలి అంటే కొత్త వారికి సాధ్యం అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

20 ఏళ్లుగా బాలీవుడ్ వారు వెస్ట్రన్ కల్చర్ ను ఫాలో అవుతున్నారు. అంతే కాకుండా ఎక్కువగా రీమేక్ లపై ఆధారపడుతున్నారు. పైగా బాలీవుడ్ వారు మరియు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అందుకే ఎక్కువ సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు.. అంతే కాకుండా ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం లేదని అన్నాడు.

మంచి కంటెంట్ ఉన్న వారిని బాలీవుడ్ వారు వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త వారితో వర్క్ చేసిన సమయంలోనే కొత్త కంటెంట్ ను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. రణ్ బీర్ సినిమాలు కూడా ఈమధ్య కాలంలో నిరాశ పర్చిన విషయం తెల్సిందే.