ఆది పినిశెట్టి ఆ నటితో రిలేషన్ లో ఉన్నాడా?

ఆది పినిశెట్టి ముందుగా హీరోగా తెలుగు తెరకు పరిచయమైనా కానీ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం వంటి సినిమాలతో ఆది పినిశెట్టి తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి ఒక నటితో రిలేషన్ లో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ నటి పేరు నిక్కీ గల్రాని. సంజనా గల్రాని సోదరి ఈమె. ఆది పినిశెట్టి, 2017లో విడుదలైన మరకతమణి చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. నిక్కీ గల్రాని, తెలుగులో కృష్ణాష్టమి, మలుపు సినిమాల్లో నటించింది. తమిళంలో అయితే నిక్కీ బిజీ నటి అని చెప్పవచ్చు.

ఇంతకీ ఆది-నిక్కీ రిలేషన్ గురించి వార్తలు రావడానికి ప్రధాన కారణం.. ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలు. రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలు ఈ మధ్యనే ఘనంగా జరిగాయి. వీటికి పినిశెట్టి కుటుంబ సభ్యులతో పాటు నిక్కీ గల్రాని కూడా హాజరైంది.

ప్రస్తుతం చెన్నైలో లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో నిక్కీ పినిశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగడం అంతటా చర్చనీయాంశమైంది. దీంతో ఆది-నిక్కీలు తమ రిలేషన్ మరో లెవెల్ కు తీసుకెళ్లారా అన్న చర్చ నడుస్తోంది. ఆమె తప్ప బయట వారు ఫొటోల్లో కనిపించకపోవడం గమనార్హం.