AameKatha Serial 8th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఆమె కథ’ సీరియల్‌ 47 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 48 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఆమె కథ ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఇప్పుడు చూద్దాం. జనవరి 8 రాత్రి టీవీలో రాబోతున్న ఈ కథ ఏం జరిగిందో మీ ‘సమయం’లో మీకోసం.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే….

రాణీ వచ్చి.. పద్మినీకి ఒక పాత చీర ఇచ్చి.. ‘ఇది రాజమాత కట్టుకోమన్నారు. ఇది కట్టుకునే తలకు నూనె పెట్టుకోవాలని చెప్పారు’ అంటుంది. అయితే రాణీ మాటలను పట్టించుకోదు పద్మిని. అయితే ఇంతలో గౌతమ్‌ వచ్చి.. ‘అమ్మ నాకు చెప్పింది పద్మినీ.. నిజంగానే. ఈ చీర కట్టుకునే నూనె పెట్టుకోమంది. లేదంటే ప్రాబ్లమ్‌ అవుతుంది. నీకు అంత అనుమానంగా ఉంటే రాజగురువు గారికి ఫోన్ చేసి ఇస్తాను మాట్లాడు’ అంటూ ఓవర్‌ యాక్షన్ చేస్తాడు. దాంతో పద్మినీ సరేనండీ కట్టుకుంటాను’ అంటుంది. అయితే ఇందులో ఓ కుట్ర ఉంది. బయటి నుంచి వస్తున్న వెంకట్‌ వాళ్లు పద్మినీని చూసి పనిమనిషి అనుకోవాలన్నది వాళ్ల ప్లాన్‌.

ప్రేమించి.. నమ్మించి.. పెళ్లాడి..

‘జీవిత భాగస్వామి’ అనే.. ఒకే ఒక్క మనిషిని నమ్మి.. జీవితాన్ని పనంగా పెట్టిన ఓ ఆడపిల్ల కథే ‘ఆమెకథ’. ప్రాణం అనుకుని నమ్మి.. ప్రాణప్రదంగా ప్రేమించి, పెళ్లాడి, సర్వం అర్పించి.. అతడి వంశాన్ని గర్భంలో మోస్తూ.. చివరికి అతడు మంచివాడో, చెడ్డవాడో తెలియని సందిగ్ధంతో సతమతమవుతూ, అతడితోనే అక్రమసంబంధం పెట్టుకున్న పనిమనిషి శాడిజం బలైపోతూ.. ఊహించని సమస్యల్లో చిక్కుకున్న ఆమె(పద్మినీ) అనుక్షణం ఎటూ తేల్చుకోలేని అయోమయంతో, తట్టుకోలేని ఆవేదనతో ఉక్కిరి బిక్కిరైపోతుంది.

రాజకోటలోకి ఎంట్రీ!

వెంకట్, బాబులు రాజకోటలో అడుగుపెడతారు. వీరేంద్ర, అతడి భార్య దేవీలకు వెంకట్‌ బాగా సోప్‌ వేస్తాడు. ‘మేడమ్‌ మీరు చాలా యాంగ్‌గా ఉన్నారు. నేను తియ్యబోయే సినిమాలో మీరు హీరోయిన్‌ చెల్లలుగా చేస్తారా?’ అంటూ బాగా ములగచెట్టు ఎక్కిస్తాడు. వెంకట్‌ వాళ్లని పైన ఓ గెస్ట్‌ రూమ్‌లో ఉండమని, రేపు సాయంత్రానికి కల్లా మీరు వెళ్లిపోవాల్సి ఉంటుందని.. వీరేంద్ర చెప్పడంతో సరే అంటాడు వెంకట్‌.

కన్నయ్యా ఏం చేస్తున్నావ్?

జానకీ దగ్గరకు వెళ్లిన వీరేంద్ర.. ‘అథిదులకు ఏం కావాలో అవి ఏర్పాటు చెయ్యి’ అనడంతో కాఫీ తీసుకుని పైకి వెళ్తుంది జానకీ. అయితే అక్కడ వెంకట్‌ని చూసి షాక్‌ అవుతుంది. వెంకట్‌ నవ్వుతాడు. (కానిస్టేబుల్‌ అయిన జానకీ.. పనిమనిషిలా ఈ కోటకు రావడానికి కారణం వెంకట్టే). రాణీ చిన్ని పాత చీర కట్టుకున్న పద్మినీ.. ఓ చిన్న టెడ్డీ బేర్‌ బొమ్మను పట్టుకుని ‘కన్నయ్యా నా కడుపులో ఏం చేస్తున్నావ్? నీ కోసమే ఇక నుంచి నేను బతికేది. నువ్వు నా ప్రాణం’ అంటూ తన అత్తగారి గురించి, తన భర్త గురించి చెప్పుకుంటూ ఉంటుంది.

సంతోషంగా పద్మినీ!

ఇంతలో గౌతమ్‌ పెద్ద టెడ్డీ బేర్‌ తీసుకొచ్చి సప్రైజ్‌ ఇస్తాడు. దాంతో పద్మినీ చాలా హ్యాపీ ఫీల్‌ అవుతుంది. కోటలో ఉన్న వెంకట్‌ చాలా ఆసక్తిగా అంతా గమనిస్తూ ఉంటాడు. ‘కోటలోని మొత్తం సమాచారం సంపాదించి తీరాలి’ అనుకుంటాడు మనసులో.. సీన్ కట్ చేస్తే.. వెంకట్, బాబులను గౌతమ్‌ ముందుకు తీసుకొస్తారు వీరేంద్ర, దేవిలు. గౌతమ్‌ని చూసిన వెంకట్‌.. నవ్వుతూ పలకరిస్తాడు.

మీకు రాణీ చూపిస్తుంది!

తను తియ్యబోయే సినిమా కోసం.. సెట్‌ వెయ్యడానికి కోట మొత్తం తిరగాలని, అంతా గమనించాలని, అందుకు అనుమతించాలని వెంకట్ కోరడంతో.. అక్కడే ఉన్న రాణీ.. గౌతమ్‌కి వద్దంటూ సైగలు చేస్తుంది. అయితే అదంతా గమనించిన గౌతమ్‌.. ‘మీకు రాణీ ఈ కోట మొత్తం చూపిస్తుంది’ అంటూ రాణీకి అప్పగిస్తాడు. అయితే రాణీ పద్మినీ దేవిని వెంకట్‌ చేస్తాడా? చూసి గుర్తుపడతాడా? తనకు ఉన్న ప్రమాదం గురించి చెప్పి తనని తప్పిస్తాడా లేదా? అనేది ఆసక్తిగా మారింది.

కమింగ్ అప్‌లో…

గౌతమ్.. పద్మినీ ఉండే రూమ్ మొత్తం చిన్న బాబుల ఫొటోస్, దేవుళ్ల ఫొటోస్ అంటిస్తాడు. అది చూసిన పద్మినీ.. ‘ఏంటండీ ఇవన్నీ అంటిస్తున్నారు?’ అని అడుగుతుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన రాణీ.. నవ్వుతూ.. అన్ని మరిచిపోయి.. ‘పద్మినీ అమ్మగారూ.. గౌతమ్ బాబు చిన్నప్పటి ఫొటోస్ చూస్తే భలే ముద్దుగా ఉంటారు కదా? అసలు ఆ నవ్వు.. ఆ కళ్లూ’ అంటూ ఏదేదో అనేస్తుంది. దాంతో పద్మినీ షాక్ అయ్యి చూస్తుంటే.. అది గమనించిన గౌతమ్ కాస్త ఇబ్బందిగా చూస్తుంటాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ఆమె కథ కొనసాగుతోంది.