కూతురి వయసు హీరోయిన్‌తో అఫైరా?

దంగల్‌లో అమీర్‌ఖాన్‌ పెద్ద కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్‌కి ప్రస్తుతం అమీర్‌ గాడ్‌ ఫాదర్‌ అవతారమెత్తాడు. ఆమె కెరియర్‌ సరిగా ప్లాన్‌ చేసుకునే విధంగా తనే సలహాలిస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. తన తదుపరి చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’లో ఫాతిమా పేరుని అమీర్‌ సిఫార్సు చేసాడనే టాక్‌ వుంది.

తాజాగా బాలీవుడ్‌ మీడియాలో ఒక వర్గం అమీర్‌, ఫాతిమా మధ్య అఫైర్‌ నడుస్తోందనే పుకారు లేపింది. దీని వల్ల అమీర్‌, కిరణ్‌ రావుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం అమీర్‌, ఫాతిమాతోనే కలిసి వుంటున్నాడని, త్వరలో ఆమెని మూడవ పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా రూమర్స్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు.

అయితే ఫాతిమా మరో యువ నటుడితో చాలా కాలంగా రిలేషన్‌లో వుందనేది కూడా బాలీవుడ్‌ మీడియానే బయట పెట్టింది. పెళ్లి పుకార్ల గురించి అమీర్‌ ఇంకా స్పందించకపోయినప్పటికీ, ఫాతిమా పేరుని సిఫార్సు చేస్తున్నాడనే పుకార్లని తీవ్రంగా ఖండించాడు.

తానెప్పుడూ ఎవరి పేరుని రికమండ్‌ చేయలేదని, ఇకపై కూడా చేయబోనని, తెలిసీ తెలియని వార్తలు ప్రచారం చేయవద్దని మీడియాకి గడ్డి పెట్టాడు. కానీ కమాల్‌ ఆర్‌ ఖాన్‌ లాంటి వాళ్లు సరాసరి అమీర్‌ఖాన్‌ని ట్యాగ్‌ చేస్తూనే ఫాతిమాతో అఫైర్‌ వుందని బల్ల గుద్ది చెబుతున్నారు. దీనిపై అమీర్‌ స్పందన ఎలాగుంటుందో చూడాలిక.