బాలీవుడ్‌ స్టార్‌ లవ్‌ బర్డ్స్‌ పెళ్లికి వేలాయనా?

బాలీవుడ్‌ స్టార్‌ లవ్‌ బర్డ్స్ రణబీర్‌ కపూర్‌ మరియు ఆలియా భట్ లు పెళ్లికి సిద్దం అయ్యారు. కరోనా వచ్చి ఉండకుంటే ఈ ఏడాది సమ్మర్ లో లేదా అటు ఇటుగానే పెళ్లి జరిగేది. ఈ విషయాన్ని స్వయంగా రణబీర్ కపూర్‌ చెప్పుకొచ్చాడు. ఆలియా భట్ కూడా పెళ్లి విషయంలో ఇటీవల హింట్ ఇచ్చింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. నేడు ఆలియా భట్ రణబీర్‌ కపూర్‌ లు నిశ్చితార్థంకు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.

రాజస్థాన్‌ లోని రత్నంబోర్‌ నేషనల్‌ పార్క్‌ లో వీరి ఎంగేజ్‌ మెంట్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని నిన్న ప్రముఖ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇరు ఫ్యామిలీలు అక్కడకు వెళ్లాయి. సాదారణ అకేషన్‌ కు వెళ్లి ఉంటే ఆలియా మరియు రణబీర్‌ కపూర్‌ లు మాత్రమే వెళ్లారు. కాని ఈసారి కుటుంబ సభ్యులు అంతా వెళ్లడం వల్ల ఖచ్చితంగా నిశ్చితార్థ వేడుక జరుగబోతుంది అంటున్నారు. నేడు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీరి పెళ్లి కూడా మరీ ఆలస్యం అవ్వకుండా వచ్చే సమ్మర్‌ కు ముందే ఉంటుందని అంటున్నారు.