కొత్త పెళ్లికూతురు హాలీవుడ్ ఎగ్జైట్ మెంట్ ఇలా!

కొత్త పెళ్లి కూతురు అలియా భట్ విరామం లేకుండా షూటింగ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. పెళ్లైన కొన్ని గంటలకే బ్యాలెన్స్ షూట్ లో జాయిన్ అయింది. దీంతో అంతా షాక్ అయ్యారు . హానీమూన్ కి వెళ్లకుండా అప్పుడే బిజీ అవసరమా? అన్న వాళ్లు ఉన్నారు. అయితే బ్యాలెన్స్ షూట్ తర్వాత తీరిగ్గా ప్రశాంతంగా ప్లాన్ చేసుకుని ఉంటారని..అందుకే చకచకా బ్యాలెన్స్ పూర్తి చేస్తుందని ఇంకొంత మంది భావించారు.

కానీ తాజా సన్నివేశాన్ని బట్టి అలియాభట్ కి హానీమూన్ కి వెళ్లే ఉద్దేశమే లేదని తేలిపోయింది. ఓ వైపు రణబీర్ కపూర్ ‘యానిమల్’ షూటింగ్ లో బిజగా ఉంటే..అలియా పాత సినిమా షూటింగ్ లు పూర్తిచేసి హాలీవుడ్ సినిమా షూట్ కి రెడీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ లో అలియాభట్ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఆ సినిమా షూటింగ్ కి అలియాభట్ హాజరవుతుంది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో రివీల్ చేసింది. ”సినిమా షూటింగ్ కి మొదటి సారి హాజరవుతున్న థ్రిల్లింగ్ కల్గుతుంది. చాలా ఎగ్జైట్ మెంట్ తో పాటు టెన్షన్ కూడా ఉంది.

ఓ కొత్త నటి సెట్స్ కి వెళ్తున్న అనుభూతి కల్గుతుందని” అలియా తెలిపింది. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఓ ఫోటోని కూడా అభిమానులకు ఇన్ స్టా ద్వారా షేర్ చేసింది. ఇందులో అలియాభట్ అందంగా ముస్తాబై షూట్ కి బయల్దేరినట్లు కనిపిస్తుంది.

‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రం ద్వారా హాలీవుడ్ అలియాభట్ తెరంగేట్రం చేస్తుంది. ఈ చిత్రంలో గాల్ గాడోట్ .. జామీ డోర్నన్ వంటి స్టార్ నటులతో కలిసి అలియా తెరను పంచుకుంటుంది. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని నెట్ఫ్లిక్స్ .. స్కైడాన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.

హాలీవుడ్ లో ఇప్పటికే కొంత మంది బాలీవుడ్ నటీమణులు నటించిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా.. ఐశ్వర్యారాయ్ బచ్చన్.. దీపికా పదుకొణె.. అనిల్ కపూర్.. ఇర్ఫాన్ ఖాన్.. అలీ ఫజల్ వంటి వారు హాలీవుడ్ నటించారు. తాజాగా ఈ వరుసలో అలియాభట్ కూడా చేరింది. మరి అక్కడ అమ్మడి సక్సెస్ రేటు ఎలా ఉంటుందో చూడాలి. ప్రియాంక చోప్రా అయితే అక్కడ స్టార్ గా వెలిగిపోతుంది.