టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’, బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ‘పుష్ప’ అని రివీల్ చేశారో దాంతో సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ లుక్ సెన్సేషన్ అయ్యింది. అనుకున్న దాని ప్రకారం మార్చ్ చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా లాక్ డౌన్ వలన ఆగిపోయింది.

తాజా పరిస్థితుల ప్రకారం ముందుగా షూట్ చేద్దామనుకున్న బ్యాంకాక్, కేరళ లొకేషన్స్ ని పక్కన పెట్టేసి ఇక్కడ లోకల్ అడవుల్లో షూటింగ్ చేయడానికి కొత్త ప్రణాళికని సిద్ధం చేశారు. షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తే తక్కువ టీంతో మూవీ టీమ్స్ అన్నీ ఇమ్మీడియట్ గా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం దీనికి నో చెప్పేశాడట.

ఓ మాక్ టెస్ట్ షూటింగ్ వీడియోని త్వరలోనే సీఎం కేసీఆర్ కి చూపించి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇప్పిస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఒకవేళ ఆయన పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ జూన్ అండ్ జులైలో మనం మాత్రం షూటింగ్ మొదలు పెట్టేది లేదని అల్లు అర్జున్ ఈ చిత్ర టీంకి తెలిపాడట. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా రిజిష్టర్ అవుతున్నాయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలువురికి ఇబ్బంది క్రియేట్ చేసిన వాళ్ళమే అవుతాము. అందుకే ఆగష్టు వరకూ నో షూటింగ్ అని చెప్పేయడంతో ఈ చిత్ర టీం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారట.

ఈ లోపు చాలా వరకూ క్లియర్ అయితే ముందుగా అనుకున్నట్టు కేరళ ఫారెస్ట్ లోనే షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు.