చిత్తూరు యాసలో చితగ్గొట్టేస్తాడు!

అల్లు అర్జున్ నటించే ఇరవైవ చిత్రం చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఆర్యతో అల్లు అర్జున్ ని స్టార్ ని చేసిన సుకుమార్ ఈసారి అతడిని పక్కా మాస్ పాత్రలో చూపించబోతున్నాడు. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి టైటిల్ కూడా శేషాచలం అని పెడుతున్నారని, ఇందులో బన్నీ పేరు కూడా అదేనని రూమర్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ పుట్టినరోజున అంటే ఏప్రిల్ 8న ఒక ప్రకటన రానుంది. అది టైటిల్ ప్రకటన అని అనుకుంటున్నారు.

ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతాడని ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చేసారు. బన్నీ యాసలో వేరియేషన్ చూపిస్తే ఎలా ఉంటుందో రుద్రమదేవిలో చూసాం కదా. సుకుమార్ నేతృత్వంలో బన్నీ ఖాతాలో మరో స్పెషల్ సినిమాగా దీనిని ఇప్పుడే జమ చేసేసుకోవచ్చు.