నాకా.. హ‌రిప్రియ‌తో గొడ‌వా?#anchor varshini

తోటి యాంక‌ర్ హ‌రిప్రియ‌తో త‌న‌కు విభేదాలున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ఢీ జోడీ యాంక‌ర్ వ‌ర్షిణి ఖండించింది. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. హ‌రిప్రియ గురించి ఆమె మాట్లాడింది. మీకు హ‌రిప్రియ‌తో విభేదాలున్న‌ట్లు ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తుంటాయి.. వాటిపై ఏమంటారు అని అడిగితే.. అలాంటిదేమీ లేద‌ని, ఇలాంటి వార్త‌లు ఎందుకొస్తాయో తెలియ‌ద‌ని వ‌ర్షిణి అంది.

అలాగే మ‌రో యాంక‌ర్ శ్రీముఖితో విభేదాలంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను కూడా ఆమె ఖండించింది. ఐతే వీళ్లిద్ద‌రితో త‌న‌కు పెద్ద‌గా స్నేహం లేద‌ని కూడా ఆమె స్ప‌ష్టం చేసింది. హాయ్, బాయ్ చెప్పుకునే వ‌ర‌కే వారితో స్నేహం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

ప్రస్తుతం తెలుగులో ఉన్న యాంక‌ర్ల‌కు ర్యాంకులు ఎలా ఇస్తార‌ని ఇంట‌ర్వ్యూయ‌ర్ అడ‌గ్గా.. సుమ‌కు నంబ‌ర్ వ‌న్ ర్యాంకు ఇచ్చింది వ‌ర్షిణి. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఝాన్సీ, శ్రీముఖి, ర‌ష్మి, అన‌సూయ‌ల పేర్లు చెప్పి త‌ర్వాతి స్థానాన్ని త‌న‌కు ఇచ్చుకుంది. చివ‌ర‌గా హ‌రిప్రియ పేరు చెప్పింది.
హ‌రిప్రియ పేరు చివ‌ర్లో చెప్పారేంటి అని అడిగితే.. చివ‌రి స్థానం నాకు ఇచ్చుకోమంటారా అని వ‌ర్షిణి న‌వ్వుతూ ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలోనే హ‌రిప్రియ‌తో విభేదాల గురించి ఇంట‌ర్వ్యూయ‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అదంతా ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేసింది వ‌ర్షిణి.

కొన్ని సినిమాల్లో న‌టించినా బ్రేక్ అందుకోలేక‌పోయిన వ‌ర్షిణి.. ప్ర‌స్తుతం బుల్లితెరకే ప‌రిమితం అయిపోయింది