హీరోయిన్లని గెంటేసిన అనిల్ రావిపూడి?

సరిలేరు నీకెవ్వరు తర్వాత మరో అగ్ర హీరోతో మరో కమర్షియల్ సినిమా తీస్తాడని అనుకున్న అనిల్ రావిపూడి హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతో ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేసాడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఇది చేయాలని ఎప్పుడో ఒప్పందం చేసుకున్న రావిపూడి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు.

ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న అనిల్ రావిపూడి ఈసారి కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ జోడీని రిపీట్ చేయబోతున్నాడు. అయితే ఈసారి తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు కాదట. మొదటి సినిమాకి సంబంధం లేకుండా హీరోలని, ఫ్రస్ట్రేషన్ కాన్సెప్ట్ ని మాత్రమే సీక్వెల్ లో పెడతాడట.

అంచేత హీరోయిన్లు రిపీట్ చేయడం లేదని, ఈసారి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ నటిస్తారని, అలాగే మరో ప్రముఖ హీరో కూడా ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తాడని టాక్ ఉంది.