లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ తో ఎఫ్ 3?

అనిల్ రావిపూడి ప్రస్తుతం టైం వేస్ట్ చేసుకోకుండా ఎఫ్ 3కి స్క్రిప్ట్ రాసుకుంటున్నాడట. తన రైటింగ్ టీమ్ ని తీసుకుని స్వస్థలానికి లాక్ డౌన్ ముందే వెళ్ళిపోయాడట. అక్కడే కూర్చుని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సీక్వెల్ కి కథ సిద్ధం చేస్తున్నాడట.

లాక్ డౌన్ నేపథ్యంలో భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు ఎలా ఉంటాయనేది కూడా ఈ కథలో ఇంక్లూడ్ చేస్తున్నాడట. లాక్ డౌన్ వల్ల భార్యాభర్తలు ఎక్కువ సమయం ఒకే చోట ఉండడం వల్ల చాలా గొడవలు వస్తున్నాయని వార్తలొస్తున్నాయి, వాట్సాప్ లో చాలా జోక్స్ కూడా సర్కులేట్ అవుతున్నాయి. దీనిని వాడుకుంటే ట్రెండీగా ఉంటుందని ఈ నేపథ్యం కూడా వాడేస్తున్నారట.

వెంకటేష్, వరుణ్ తేజ్ తమ పాత్రలు కంటిన్యూ చేస్తారని, మరో నటుడు కూడా జాయిన్ అవుతాడని ఎఫ్ 3 గురించి వార్తలు వస్తున్నాయి. జులైలో షూటింగ్ స్టార్ట్ చేసి, సంక్రాంతికి విడుదల చేయాలని అనిల్ రావిపూడి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది.