పవన్ హీరోయిన్ రెచ్చిపోతోందిగా..

టీనేజీలోనే హీరోయిన్ అయిపోయిన మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్. ఓ సినిమాలో స్కూల్ పాపలా కనిపించిన కొన్నేళ్లకే హీరోయిన్ అవతారం ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ అమ్మాయి.. గత ఏడాది ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమా పర్వాలేదనిపించడం.. లేటెస్టుగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ కూడా సక్సెస్ కావడంతో ఈ భామకు లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చేసింది.

ఇంతలోనే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సరసన అవకాశం పట్టేసి తోటి హీరోయిన్లకు పెద్ద షాకే ఇచ్చిందీ భామ. పవన్ సినిమాను పునాదిగా చేసుకుని పెద్ద హీరోయిన్ అయిపోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లే ఉంది అను తీరు చూస్తుంటే. పవన్ సినిమా ఓకే అయినప్పటి నుంచి అను ఇమ్మాన్యుయెల్ లుక్ కొత్తగా కనిపిస్తుండటం గమనించవచ్చు. తన ఫిజిక్ మీద.. లుక్స్ మీద అమ్మడు బాగానే శ్రద్ధ పెట్టినట్లుంది.

ఈ మధ్య బయటికి వచ్చిన ఫొటోల్లో కొంచెం కొత్తగా కనిపిస్తోంది అను. ఇంతకుముందుతో పోలిస్తే ఈ ఫొటో షూట్లలో హాట్ హాట్‌గానూ దర్శనమిస్తోంది అను. తాజా ఫొటో షూట్లో చాలా సెక్సీగా దర్శనమిస్తోంద భామ. పవన్ సినిమాలో ఛాన్స్ అందుకున్నంత మాత్రాన సరిపోదని.. ఇదే మంచి తరుణం అని భావించి తన అందంతో.. గ్లామర్‌తో మరింతగా టాలీవుడ్ దర్శక నిర్మాతల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంది అను.