అనుష్క శర్మను దేవదూత అని పిలిచిన సమంత

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సోషల్‌ మీడయాలో షేర్‌ చేసిన తన బేబీ బంప్‌ పోస్టుకు టాలీవుడ్‌ స్టార్‌ హిరోయిన్‌ సమంత అక్కినే స్పందిచిన తీరు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. బ్లాక్‌ కలర్‌ స్విమ్‌ షూట్‌ ధరించిన ఫొటోను అనుష్క మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రమ్‌ షేర్‌ చేస్తూ చేసింది. ఈ పోస్టు చూసిన సమంత అనుష్కను ‘దేవదూత’ అని పిలిచారు. అంతేగాక స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద దిగిన తన బేబీ బంప్‌ ఫొటోకు బాలీవుడ్‌ నటీనటులు, అభిమానులు తమ స్పందనను తెలుపుతున్నారు.

ఇక ఈ పోస్టు అనుష్క ‘మీ జీవితంలో ఇప్పటికే కలిగి ఉన్న మంచిని అంగీకరించడం సమృద్ధికి పునాది. నా మంచిని కోరుతూ.. దయ చూపుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ పంచుకున్నారు. అదే విధంగా ఇటీవల విరూష్కలు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారి అభిమానులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియలో విరూష్కలకు అభినందనలు తెలిపారు.