బిగ్ బాస్4: ఎపిసోడ్80- అవినాష్‌కు లక్‌ కలిసి వచ్చింది, అరియానాకు దెయ్యం కనిపించింది

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 చివరి వారాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ సోమ వారం ఎపిసోడ్‌ లో రసవత్తరంగా సాగింది. మోనాల్‌, అఖిల్‌, అరియానా మరియు అవినాష్‌ లు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ను గెలుచుకునేందుకు టాస్క్‌ ఇచ్చారు. రెండు రౌండ్‌ లుగా సాగిన టాస్క్‌ లో భాగంగా మొదట నలుగురు కలిసి బిగ్‌ బాస్‌ జెండాలను దక్కించుకోవాలి. నలుగురిలో అఖిల్‌ మరియు అవినాష్‌ లు ఎక్కువ జెండాలను దక్కించుకుని రెండవ రౌండ్‌ కు వెళ్లారు.

రెండవ రౌండ్ లో వారిద్దరు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం చేసుకోవాల్సి ఉంది. ఇంటి సభ్యుల ఓట్లను దక్కించుకునేందుకు అఖిల్‌ మరియు అవినాష్‌ లు రాజకీయ నాయకులుగా మారారు. ఇద్దరు కూడా చాలా సమయం సరదాగా హోరా హోరీ అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. అవినాష్‌ కు డైరెక్ట్‌ గా అరియానా సపోర్ట్‌ చేయగా, అఖిల్‌ కు సోహెల్‌ సపోర్ట్‌ చేశాడు. ఇక చివరకు ఓటింగ్‌ విషయానికి వచ్చేప్పటికి అఖిల్‌ కు మోనాల్‌ మరియు సోహెల్‌ లు ఓటు వేయగా, అవినాష్‌ కు అరియానా, హారిక మరియు అభిజిత్‌ లు ఓట్లు వేశారు. దాంతో అవినాష్‌ గెలిచాడు. రెండు వారాలకు గాను ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వచ్చింది. దాన్ని అతడు ఎప్పుడైనా వాడుకోవచ్చు.

తాజా ఎపిసోడ్‌ మొత్తం చాలా ఎమోషనల్‌ గా సాగింది. అందరికి కూడా ఎమోషనల్‌ గా టచ్‌ అయ్యింది. అవినాష్‌ ఓట్లు అడుగుతున్న సమయంలో కన్నీరు పెట్టుకోవడంతో అంతా కూడా కాస్త ఎమోషన్‌ అయ్యారు. ఇక తదుపరి ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది. అరియానాకు దెయ్యం కనిపించింది. ఆ దెయ్యం ఏంటీ అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.