బాలయ్య – ఎన్టీఆర్ కాంబో మూవీ.. సాధ్యమయ్యేనా?

నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఇప్పటివరకూ సాధ్యమవ్వలేదు. బాలయ్య హీరోగా నటించిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో కళ్యాణ్ రామ్ నటించాడు. తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించాడు కళ్యాణ్ రామ్. బాలయ్య – కళ్యాణ్ రామ్ సీన్స్ వచ్చినప్పుడు నందమూరి అభిమానులు ఖుషీ అయ్యారు. అదే సమయంలో బాలయ్య – ఎన్టీఆర్ కాంబో కూడా చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.

ఈ ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెల్సిందే. అయితే అలాంటిదేం లేదని మేము బానే ఉన్నామని తామంతా ఎప్పటికీ ఒక్కటేనని ఇరువురూ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ – బాలకృష్ణ హీరోలుగా సినిమాను నిర్మించడానికి కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుదిరితే ఆ చిత్రంలో తాను కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఇద్దరి కాంబో ఇప్పట్లో వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువే. ఎన్టీఆర్ వచ్చే రెండేళ్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలయ్య కూడా రెండు సినిమాల కమిట్మెంట్స్ తో బిజీ. మరి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి వీలు చేసుకుంటారా, అది కుదురుతుందా అంటే అది డౌటే అని అనుకోవచ్చు.