బాలయ్య తర్వాతి సినిమాపై క్రేజీ అప్డేట్

నందమూరి బాలకృష్ణకు 3-4 డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కచ్చితంగా ఎప్పటికైనా చేస్తానని నమ్మకంగా ఉన్నాడు. అందులో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ కూడా ఒకటి. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా బాలయ్య చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తోంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బాలయ్య అభిమానులను సంతోషానికి గురి చేస్తోంది. అదే ఆదిత్య 999 ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైపోయిందట. బాలయ్య కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడట. అత్యంత భారీ బడ్జెట్ తో పలు భాషల్లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. వరస ప్లాపుల్లో ఉన్న బాలయ్య, ఈ సినిమాతో తిరిగి సూపర్ హిట్ కొట్టాలని బాలయ్య అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను బాలయ్య టేకప్ చేస్తాడేమో చూడాలి.