మ‌హిళ‌ల‌తో బాల‌కృష్ణ చాలా…

ఒక సినిమా ఫంక్ష‌న్‌లో మ‌హిళ‌ల గురించి టాలీవుడ్ హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌దమైన విష‌యం తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యేగా, ఏపీలో అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధిగా ఆయ‌న బాధ్య‌తా ర‌హితంగా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేశార‌ని రాజ‌కీయ దుమారం కూడా చెల‌రేగింది. చివ‌రికి బాల‌కృష్ణ మ‌హిళ‌ల‌పై చేసిన కామెంట్స్‌…అసెంబ్లీలో చ‌ర్చ‌కు దారి తీశాయి. అలాంటి బాల‌కృష్ణ‌పై వ‌ర్థ‌మాన హీరోయిన్ స్వీటీ చేసిన కామెంట్స్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి.

స్వీటీ అంటే వెంట‌నే గుర్తించ‌డం క‌ష్టం. కానీ సంచ‌ల‌న‌, వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ రూపొందించిన “న‌గ్నం” సినిమా హీరోయిన్ అంటే వెంట‌నే గుర్తు ప‌డ‌తారు. వ‌ర్మ సినిమాతో టాలీవుడ్ దృష్టిని త‌న వైపు తిప్పుకుంది స్వీటీ. ఆమె అస‌లు పేరు శ్రీ‌రాపాక అని తెలిసొచ్చింది. ఇప్పుడిప్పుడే ఈమె వివ‌రాలు టాలీవుడ్ అభిమానుల‌కి తెలుస్తున్నాయి. టాలీవుడ్‌లో కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప్ర‌ముఖుల‌కు సుప‌రిచితురాలే.

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ‌ హీరో, హీరోయిన్లతోనూ ఆమె పని చేసింది. న‌గ్నం సినిమా విడుద‌ల త‌ర్వాత ఆమె ఇంట‌ర్వ్యూల కోసం సోష‌ల్ మీడియా తెగ ఉత్సాహం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

“కాస్ట్యూమ్ డిజనర్‌గా పెద్ద హీరోల సినిమాలకు పని చేశాను. ఓ సారి డిస్కషన్ కోసం నందమూరి బాలకృష్ణ ఇంటికెళ్లా. బాల‌కృష్ణ‌కు కోపం ఎక్కువని అందరూ అంటారు కదా! కానీ, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. మ‌న‌సులో ఏదీ దాచుకోడు. కాకపోతే నాలాగే కాస్త షార్ట్ టెంపర్. త్వరగా కోపం వచ్చేస్తుంది. వెంటనే చల్లారిపోతుంది. మహిళలతో ఆయన చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు” అని హీరోయిన్ స్వీటీ చెప్పుకొచ్చింది.