ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య

సాధారణంగా హీరోలకు దర్శకుల ట్రాక్ రికార్డ్ అనేది చాలా ముఖ్యం. ప్లాప్ ఇచ్చిన దర్శకులు మళ్ళీ అవకాశాలు అందుకోవాలంటే చాలా కష్టం. అందులోనూ టాప్ దర్శకులు పరిస్థితి కొంత పర్వాలేదు కానీ మీడియం రేంజ్ దర్శకులు ప్లాప్ ఇచ్చారంటే వారిని కలవడానికి కూడా చాలా మంది హీరోలు ఇష్టపడరు. అయితే బాలకృష్ణ వంటి హీరోలు ఇందుకు మినహాయింపు.

ఎందుకంటే బాలకృష్ణ హిట్లు, ప్లాపులు వంటివి పట్టించుకోడు. కథ నచ్చితే దర్శకుడు ఎలాంటి వాడైనా, తన ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా సినిమా చేసేస్తాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ సినిమా పూర్తవుతుంది.

అయితే ఈలోగానే బాలకృష్ణ తన తర్వాతి సినిమాకు పచ్చజెండా ఊపేసాడు. శ్రీవాస్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన బాలయ్య వెంటనే ఫుల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని చెప్పినట్లు సమాచారం. ఇద్దరూ ఇదివరకు డిక్టేటర్ సినిమాకు కలిసి వర్క్ చేసారు. ఆ సినిమా బిలో యావరేజ్ గా ఆడింది. శ్రీవాస్ లాస్ట్ సినిమా సాక్ష్యం కూడా పెద్ద ప్లాప్. అయినా కూడా బాలకృష్ణ శ్రీవాస్ చెప్పిన యాక్షన్ కథకు ఎస్ చెప్పడం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.