వినూత్నంగా మా ఎన్నికల బరిలో దిగుతోన్న బండ్ల గణేష్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ప్రెసిడెంట్ బరిలో పోటీ పడుతున్నారు. వారిద్దరూ కూడా తమ ప్యానెల్స్ ను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాను ప్రకటించారు.

ఇదిలా ఉంటే బండ్ల గణేష్ కు మా అసోసియేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగుతోంది. అయితే బండ్ల గణేష్ ప్రెసిడెంట్ గా కాక జనరల్ సెక్రటరీగా పోటీ పడుతున్నాడు. ఇక బండ్ల గణేష్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పదవులు మీ ఇష్టం అంటూ వినూత్నంగా ప్రచారం చేపట్టారు.

అక్టోబర్ 10న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకూ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు.