అలాంటి వారంటే నాకు ఇష్టం : బెల్లంకొండ

అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాస్ ఆడియన్స్‌ లో మంచి క్రేజ్‌ ను దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన చేసిన సినిమాలు ఒకటి రెండు నిరాశ పర్చినా కూడా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచి పోయింది.

గత కొన్ని రోజులుగా గుబురు గడ్డంతో పాటు రఫ్‌ లుక్‌ లో కనిపించిన బెల్లంకొండ హీరో ఉన్నట్లుండి క్లీన్‌ షేవ్‌ తో కనిపించాడు. తన గడ్డం లుక్‌ ను మరియు క్లీన్‌ షేవ్‌ లుక్‌ ఫొటోలను షేర్‌ చేసిన బెల్లంకొండ హీరో.. ఈ ఏడాది మొదలు అయినప్పటి నుండి ఎన్నో జరిగాయి. కాని అన్ని సమయాల్లో కూడా మొహంపై చిరు నవ్వును వదిలేయకుండా ఉన్న వారు ఉన్నారు.

ఇబ్బందుల్లో ఉన్న వారు కూడా చిరు నవ్వు వదలకుండా ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆ చిరు నవ్వుకు కారణం ఉంటుంది. దానిని కనిపెట్టుకుని ఎప్పుడు సంతోషంగా ఉండేవారు అంటే నాకు ఎప్పటికి ఇష్టమే. వారిని ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని అందరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ పోస్ట్‌ చేశాడు.