బిగ్ బాస్4: ఎపిసోడ్ 40- ఫ్యామిలీ జ్ఞాపకాలతో కన్నీరు పెట్టుకున్న కంటెస్టెంట్స్‌

ప్రతి సీజన్‌ లో కూడా ఒక ఎపిసోడ్‌ లో ఇంటి సభ్యులందరికి కూడా వారి వారి కుటుంబ సభ్యుల ఫొటోలను చూపిస్తూ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకోండి అంటూ బిగ్‌ బాస్‌ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ ఎపిసోడ్‌ చాలా భారంగా కన్నీరుతో సాగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ లో నిన్నటి ఎపిసోడ్‌ లో ఆ సెంటిమెంట్‌ సీన్స్‌ చూపించారు. ఇంటి సభ్యులందరికి సంబంధించిన చిన్నప్పటి ఫొటోగ్రాఫ్స్‌ మరియు విషయాలను గుర్తు చేశారు. ఆతర్వాత ఒక్కరు ఒక్కరుగా తమ కుటుంబంలోని విషయాలను చెబుతూ నవ్వించారు.. కొందరు ఏడిపించారు. తమ కుటుంబం పడ్డ బాదలను నిన్నటి ఎపిసోడ్‌ లో చాలా మంది కంటెస్టెంట్స్‌ చెప్పారు. అరియానా.. హారిక.. అమ్మ రాజశేఖర్‌.. సోహెల్‌ ఇలా అంతా కూడా తమ కుటుంబంను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

అరియానా మాట్లాడుతూ తన అసలు పేరు అర్చన. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్న విడిపోయారు. ఆ సమయంలో అమ్మ మమ్ములను చాలా కష్టపడి పెంచారు. యాంకర్‌ అవుతాను అంటూ వద్దన్ని అన్నారు. అయినా నేను అమ్మను ఒప్పించి యాంకర్‌ అయ్యాను. 500 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడి ఈవెంట్‌ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఆ స్థాయి నుండి నేను ఇప్పుడు ఈ స్తాయికి వచ్చాను. అమ్మ నన్ను ఎంతగా ఇన్సిపైర్‌ చేసింది అంటూ ఎప్పుడు గల గల మాట్లాడే అరియానా కన్నీరు పెట్టించింది. నోయల్‌ మాట్లాడుతూ అమ్మ వంద రూపాయల కోసం ఇంట్లో పని చేసేది. నాన్న ఏ పని దొరికితే అది చేసేవాడు. చాలా ఇబ్బందులు పడ్డాం. నేను నటుడిని అయ్యాను అంటే నాన్న చాలా సంతోషించారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఇక హారిక చాలా చిల్‌ గా మాట్లాడినట్లే మాట్లాడి తన అమ్మా నాన్న విడిపోవడంపై మాట్లాడి అందరికి కన్నీరు తెప్పించింది. ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్‌ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. లాస్య కూడా తన వివాహం తన తండ్రి తమ ప్రేమకు ఒప్పుకోక పోవడం వంటి విషయాలను తెలియజేసి చాలా కన్నీరు పెట్టుకుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ చాలా భారంగా కన్నీటితో సాగింది. అంతకు ముందు లగ్జరీ బడ్జెట్‌ షాపింగ్‌ ను కుమార్‌ సాయి మరియు మెహబూబ్‌ లు చేశారు. ఇద్దరు కూడా స్విమ్మింగ్‌ పూల్‌ లో ఉన్న రియల్‌ మ్యాంగో జ్యూస్‌ తాగి షాపింగ్‌ చేశారు. ఆ తర్వాత ఆ బాటిల్స్‌ను అందరు కూడా తాగి పాటకు డాన్స్‌ చేశారు. ఇక నేడు ఎపిసోడ్‌ లో మళ్లీ ఎంటర్‌టైన్‌ చేసేందుకు టాస్క్‌ ను బిగ్‌బాస్‌ ఇచ్చాడు.