బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 50 – దసరా స్పెషల్‌ సమంత ఎంటర్‌టైన్‌మెంట్‌

తెలుగు బిగ్‌ బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌ నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా సాగింది. నాగార్జున వైల్డ్‌ డాగ్‌ సినిమా షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లాడు. సమంత హోస్ట్‌ అంటూ ముందే హింట్‌ ఇచ్చారు. ఎపిసోడ్‌ కు ముందు రోజు ప్రోమో కూడా విడుదల చేశారు. రంగస్థలం సినిమాలోని పాటతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇంటి సభ్యులతో ఒక ఆట ఆడుకోవడంతో పాటు అందరిని ఎంటర్‌ టైన్‌ చేసింది. నా తెలుగు ఏమైనా తప్పు అయితే దయచేసి క్షమించండి అంటూ ముందు విజ్ఞప్తి చేసి తన షో ను ఆరంభించింది. దసరా కావడంతో ఏకంగా మూడు గంటల పాటు మారథాన్‌ ఎపిసోడ్‌ ను కొనసాగించారు.

ఇంటి సభ్యుల్లో పెళ్లి కాని వారిని పక్కకు తీసి అమ్మాయిలు అబ్బాయిలుగా టీమ్‌ లు డివైడ్‌ చేసి అమ్మాయిలను ప్రపోజ్‌ చేసేలా షో నిర్వహించారు. మొదట అమ్మాయిలను ఇంప్రెస్‌ చేసేందుకు అఖిల్‌, అభిజిత్‌, అవినాష్‌, మొహబూబ్‌ మరియు సోహెల్‌ లు తీవ్రంగా ప్రయత్నించారు. దివి, మోనాల్‌, హారిక మరియు అరియానాలు అబ్బాయిల నుండి ది బెస్ట్‌ ఎంపిక చేసి అఖిల్‌ ను ఎంపిక చేయడం జరిగింది. అఖిల్‌ విజేతగా నిలవడంతో మొదట ఆయన ఫ్యామిలీని చూసే అవకాశం దక్కింది. ఫ్యామిలీ వీడియో చూసిన అఖిల్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఆ తర్వాత మోనాల్‌ కూడా ఫ్యామిలీ వీడియో చూసి చూలా ఎమోషనల్‌ అయ్యింది.

మళ్లీ గేమ్‌ సాగింది. అలా ఒకొక్కరి ఫ్యామిలీ వీడియోలు చూపిస్తూ అదే సమయంలో ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన వారిలోంచి ఒక్కొక్కరిని సేవ్‌ చేస్తూ వచ్చారు. నిన్నటి ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ ఉండదు అంటూ అంతా భావించారు. కాని షో లో నిన్న దివి ఎలిమినేట్‌ అయ్యింది. దివిని ఎలిమినేట్‌ చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చి ఇంటి సభ్యులతో రెండు ముక్కలు మాట్లాడి వెళ్లి పోయింది. దివి ఎలిమినేట్‌ అవ్వడంతో అమ్మ రాజశేఖర్‌మాస్టర్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

నిన్నటి ఎపిసోడ్‌ ను మరింత ఎంటర్‌ టైన్‌ చేసేందుకు గాను జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది వచ్చాడు. డిటెక్టివ్‌ ఆది అంటూ వచ్చిన ఆది కొన్ని పంచ్‌ లతో తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యాడు. ఇక ఆర్‌ ఎక్స్‌ 100 సినిమా హీరో మరియు హీరోయిన్‌ కార్తీకేయ మరియు పాయల్‌ లు విడి విడిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి షోను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. మొత్తానికి నిన్నటి దసరా ఎపిసోడ్‌ బిగ్‌ బాస్‌ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను అందించడంతో పాటు సమంత హోస్ట్‌ గా భలే ఉందే అన్నట్లుగా అనిపించుకుంది.