బిగ్‌ బాస్‌ 4: జున్నుగాడి రాకతో తారాస్థాయికి చేరిన ఎమోషన్స్

నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌, హారిక, అభిజిత్‌, అవినాష్‌ ల తల్లులు వచ్చారు. వారు ఉన్నది కొద్ది సమయం అయినా కూడా ఇంటి సభ్యుల మద్య ఉన్న గొడవలు అన్ని కూడా పటాపంచలు చేశారు. ముఖ్యంగా అఖిల్‌ మరియు అభిజిత్‌లు గట్టి కౌగిలింతతో తమ మద్య ఉన్న గొడవకు స్వస్థి చెప్పినట్లుగా అనిపించింది. ఇక నేటి ఎపిసోడ్‌ లో లాస్య, అరియానా, సోహెల్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ రాబోతున్నారు.

లాస్య కొడుకు జున్ను రావడంతో ఎమోషన్స్‌ పీక్స్‌ కు చేరాయి. సాదారణంగానే కొడుకును తల్చుకుని ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఎమోషనల్‌ అవుతూ ఉండే లాస్య ఈసారి కొడుకు కళ్ల ముందు ఉండి టచ్‌ చేయలేక పోవడంతో విలవిలలాడిపోయింది. అదే సమయంలో ఆమె ఆనందంకు అవధులు లేకుండా ఉంది. మంజునాధ్‌ రాకతో లాస్య కళ్లలో ఆనందం కనిపించింది. ఐ లవ్‌ యూ అంటూ గ్లాస్‌ పై రాసి అతడి ని ఎంతగా మిస్‌ అవుతుందో చెప్పే ప్రయత్నం చేసింది.

ఎపిసోడ్‌ కు హైలైట్‌ గా లాస్య, జున్ను, మంజునాథ్‌ల ఎమోషన్స్‌ నిలిచాయి. జున్ను తో ఇతర కుటుంబ సభ్యులు కూడా కొంత సమయం ఆడుకున్నారు. అవినాష్‌ జోకర్‌ ముక్కు పెట్టుకుని జున్నును ఆకర్షించాడు. ఏంటీ ఏంటీ(ఆంటీ) అంటూ మంజునాధ్‌ ముందు ర్యాగింగ్ చేసి లాస్యను అఖిల్‌ సోహెల్‌ లు ఆటపట్టించారు.

ఇక సోహెల్‌ తండ్రి చాలా జోష్‌ గా కనిపించాడు. కథ వేరే ఉంది బయట అన్నట్లుగా కొడుకు సాధిస్తున్న విజయాన్ని ఆస్వాదిస్తున్న తండ్రి మాదిరిగా అతడు కనిపించాడు. సోహెల్‌ తండ్రి కూడా చాలా సరదాగా ఇంటి సభ్యులతో మాట్లాడాడు. ఇక అరియానా సన్నిహితుడు వచ్చాడు. అతడిని చూసి అరియానా చాలా ఎమోషనల్‌ అయ్యింది.

అరియానా కోసం అమ్మ లేదా చెల్లి కాకుండా తన స్నేహితుడు రావడంతోనే వారి జీవితంలో అతడు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అతడిని చూడగానే బోరున ఏడ్చేసిన అరియానా ఒక పాయింట్ లో నాతో మా అమ్మ చెల్లి కూడా లేదు కానీ తిను నాతో ఉన్నాడు, ఐ లవ్ యు వినయ్ అని గట్టిగా అరిచి తన ప్రేమని తెలిపింది.

మోనాల్‌ మదర్ మాత్రం రాలేదు, తాను వద్దామని అనుకున్నా కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని చెప్పిన వాయిస్‌ ను వినిపించారు. దాంతో మోనాల్‌ కన్నీరు పెట్టుకోవడమే కాకుండా, బాత్‌ రూంలోకి వెళ్లి గోడల్ని కొడుతూ, గట్టి గట్టిగా ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ లో కూడా ఎమోషన్స్‌ తారాస్థాయికి వెళ్లాయి. క్లైమాక్స్‌ కు సీజన్‌ రావడందో రేటింగ్‌ ను పొందాలంటే ఇలాంటి ఎమోషనల్‌ ఎపిపోడ్‌ లు కొన్ని అవసరం. కొత్త పద్దతి ఏం కాకున్నా పాతదే అయినా ప్రేక్షకులను కట్టిపడేసేవి. అందుకే నిన్న, నేడు ఎపిసోడ్‌ లకు మంచి స్పందన వచ్చింది.

Share