చిరు నెక్స్ట్ సినిమాకు ఆచార్య సంగీత దర్శకుడి కుమారుడు!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. దాదాపు 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఇక చిరంజీవి ఆచార్యను తొందరగా పూర్తి చేసి తన తర్వాతి సినిమాలపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆచార్య పూర్తైన తర్వాత చిరంజీవి మెహెర్ రమేష్ తో కలిసి పనిచేస్తాడని విశ్వసనీయ వర్గాలు దాదాపు కన్ఫర్మ్ చేసాయి. వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం లాక్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వేదాళం రీమేక్ కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తాడని అంటున్నారు. మహతి ఇప్పటికే చాలా సినిమాలకు సంగీతం అందించినా కానీ ఇంకా స్టార్డం అందుకోలేదు. ఛలో, భీష్మ వంటి సినిమాలకు మహతి మంచి మ్యూజిక్ నే అందించాడు.

ఒకవేళ చిరంజీవి సినిమాకు మహతి సంగీతం అన్నదే నిజమైతే అది కచ్చితంగా మహతి కెరీర్ కు కీలక మలుపు అనడంలో ఎటువంటి సందేహం లేదు.