చిరంజీవి, బాలయ్య వార్… సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇద్దరూ కొలీగ్స్ అయినప్పటికీ మధ్య మధ్యలో విమర్శలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అంతలోనే ఇద్దరూ కలిసిపోతూ ఉంటారు. ఒకరి గురించి ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటీవలే జూన్ లో చిరంజీవి అధ్యక్షతన కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మీటింగ్ పెట్టుకున్నారు. దీనికి బాలయ్యను పిలవలేదు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరుతూ చిరంజీవి అండ్ కో కలిశారు. వీటికి కూడా బాలయ్యకు ఆహ్వానం లేదు. ఈ విషయంలో బాలయ్య బాగా హర్ట్ అయ్యారు. అప్పట్లో పలు ఇంటర్వ్యూలలో ఈ విషయంపై విమర్శలు చేసారు కూడా. ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలించని నేపథ్యంలో ఇద్దరి సినిమాలు ఢీకొంటాయంటూ ప్రచారం జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. దీనికి కొరటాల శివ దర్శకుడు. వచ్చే నెలలో షూటింగ్ తిరిగి మొదలుకావొచ్చు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తామని చిరంజీవి ఇటీవలే కన్ఫర్మ్ చేసాడు. అలాగే బాలయ్య – బోయపాటితో కలిసి పనిచేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు కానీ కచ్చితంగా ఏప్రిల్ 30న విడుదల చేస్తారట. ఎందుకంటే వీరిద్దరి మొదటి కాంబినేషన్ లో వచ్చిన సింహా పదేళ్ల క్రితం అదే రోజున విడుదలైంది.

చూస్తుంటే ఏప్రిల్ లో వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.