టీజర్ అప్డేట్ ఇవ్వకపోతే లీక్ చేసేస్తానంటూ బెదిరించిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఆచార్యకు సంబంధించిన అప్డేట్ కోసం చాలా కాలం నుండి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్ లో ఆచార్య గురించి అప్డేట్ ను ఫన్నీగా ఇచ్చారు.

తనకు కొరటాల శివతో ఆచార్యకు సంబంధించి సీరియస్ డిస్కషన్ నడిచిందని దానికి సంబంధించిన వివరాలు కాసేపట్లో విడుదల చేస్తానని చిరంజీవి ప్రకటించారు. కట్ చేస్తే ఒక మీమ్ టైపులో ఆచార్య అప్డేట్ ను విడుదల చేసాడు.

సోషల్ మీడియాలో చిరంజీవి మీద కొన్ని జోకులు నడుస్తున్నాయి. ఏదైనా చిరంజీవి లీక్ చేసేస్తాడు అంటూ కొన్ని జోకులు పేలుతుంటాయి. ఈ నేపథ్యంలో తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు చిరు. ఆచార్య టీజర్ అప్డేట్ ను త్వరగా ఇవ్వకపోతే లీక్ చేసేస్తాను అంటూ మీమ్ ను చేయడం విశేషం. రేపు ఉదయం 10 గంటలకు ఆచార్య టీజర్ అప్డేట్ ను ఇస్తానని కొరటాల చెప్పినట్లుగా మీమ్ ను రూపొందించడం చిరంజీవి కామెడీ సెన్స్ ను తెలియజేస్తోంది.